1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'గం గం గణేశ' ట్రైలర్

by సూర్య | Wed, May 22, 2024, 03:16 PM

నూతన దర్శకుడు ఉదయ్ శెట్టి దర్శకత్వంలో నటుడు ఆనంద్ దేవరకొండ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'గం గం గణేశ' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా మే 31, 2024న విడుదల కానుంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని విడుదల చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ట్రైలర్ వన్ మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్ మరియు జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

Latest News
 
బికినీలో దర్శనమిచ్చిన మృణాల్.. నిజమిదే.. Fri, Oct 18, 2024, 09:03 PM
టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌.. అనన్య నాగళ్ల ఏమన్నారంటే? Fri, Oct 18, 2024, 09:01 PM
'లక్కీ బాస్కర్' ట్రైలర్ లాంచ్ కి వెన్యూ ఖరారు Fri, Oct 18, 2024, 08:28 PM
'SDGM' ఫస్ట్ లుక్ విడుదలకి టైమ్ లాక్ Fri, Oct 18, 2024, 07:38 PM
'తలపతి69' లో విజయ్ పాత్రపై లేటెస్ట్ అప్డేట్ Fri, Oct 18, 2024, 07:32 PM