'పుష్ప 2' సెకండ్ సింగిల్ అనౌన్స్మెంట్ వీడియో విడుదలకి టైమ్ లాక్

by సూర్య | Wed, May 22, 2024, 02:53 PM

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2019లో బ్లాక్‌బస్టర్ మూవీస్ లో ఒకటైన పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్ గా పుష్ప 2: ది రూల్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమాలోని మొదటి సింగిల్ ని పుష్ప పుష్ప అనే టైటిల్ తో విడుదల చేసారు. ఈ సాంగ్ భారీ సెన్సేషన్ ని సృష్టించింది. తాజాగా మూవీ మేకర్స్ రేపు ఉదయం 11:07 గంటలకు ఈ సినిమా యొక్క సెకండ్ సింగల్ అనౌన్స్మెంట్ వీడియోని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పుష్ప 2ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Latest News
 
ఈ వారం OTTలో విడుదల కానున్న సిరీస్ మరియు సినిమాలు Fri, Oct 18, 2024, 05:27 PM
అఖిల్ తదుపరి సినిమాపై తాజా అప్డేట్ Fri, Oct 18, 2024, 05:23 PM
డైరెక్టర్ జ్యోతి కృష్ణ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'హరి హర వీర మల్లు' టీమ్ Fri, Oct 18, 2024, 05:18 PM
'వేట్టైయన్' ప్రీక్వెల్ గురించి ఓపెన్ అయ్యిన దర్శకుడు Fri, Oct 18, 2024, 05:06 PM
సూర్యతో తన సినిమా గురించి షాకింగ్ విషయాలని వెల్లడించిన కార్తీక్ సుబ్బరాజ్ Fri, Oct 18, 2024, 05:03 PM