షూటింగ్ పూర్తి చేసుకున్న 'డార్లింగ్'

by సూర్య | Fri, May 10, 2024, 06:08 PM

మెగా బ్లాక్‌బస్టర్ హనుమాన్ తర్వాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన కె నిరంజన్ రెడ్డి శ్రీమతి చైతన్య సమర్పణలో తన తదుపరి నిర్మాణ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. ఈ చిత్రంలో బలగం, ఓం భీమ్ బుష్, సేవ్ ది టైగర్స్ సిరీస్ విజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తుండగా, నభా నటేష్ కథానాయికగా నటిస్తుంది.


ఈ రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌కు అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి 'డార్లింగ్‌' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యినట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ సినిమాలో అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
'గం గం గణేశ' ట్రైలర్ అవుట్ Mon, May 20, 2024, 06:33 PM
50 రోజులు థియేటర్ రన్ పూర్తి చేసుకున్న 'క్రూ' Mon, May 20, 2024, 06:30 PM
రత్నం నుండి 'ఎటువైపో' వీడియో సాంగ్ అవుట్ Mon, May 20, 2024, 06:28 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Mon, May 20, 2024, 06:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సింహాద్రి' Mon, May 20, 2024, 06:23 PM