రాజధాని నగరంలో 'థగ్ లైఫ్' షూటింగ్

by సూర్య | Fri, May 10, 2024, 06:07 PM

ఉలగనాయగన్ కమల్ హాసన్ మరియు స్టార్ దర్శకుడు మణిరత్నం దాదాపు 17 సంవత్సరాల తర్వాత కలిసి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'థగ్ లైఫ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో థగ్ లైఫ్‌ సినిమా షూటింగ్ జరుగుతుంది.


ఢిల్లీలోని ఏరోసిటీలోని సంకట్ మోచన్ హనుమాన్ మందిర్‌లో చిత్ర యూనిట్ కీలక సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వేసవి తాపాన్ని నివారించడానికి ఉదయం 6 నుండి 9 గంటల వరకు కేవలం 3 గంటలు మాత్రమే షూటింగ్ జరిగింది. ఐకానిక్ టెంపుల్‌లో 3 గంటల షూటింగ్‌ను ముగించిన తర్వాత థగ్ లైఫ్ యూనిట్ కీలకమైన ఇంటీరియర్ సన్నివేశాలను చిత్రీకరించడానికి ఢిల్లీలోని ఓల్డ్ సిటీకి వెళ్లింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ మే 11న ముగియనుంది.

ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో త్రిష, అలీ ఫజల్, సన్యా మల్హోత్రా, పంకజ్ త్రిపాఠి, ఐశ్వర్య లక్ష్మి, నాజర్,  శింబు మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ మరియు మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్, మరియు శివ అనంతి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
'గం గం గణేశ' ట్రైలర్ అవుట్ Mon, May 20, 2024, 06:33 PM
50 రోజులు థియేటర్ రన్ పూర్తి చేసుకున్న 'క్రూ' Mon, May 20, 2024, 06:30 PM
రత్నం నుండి 'ఎటువైపో' వీడియో సాంగ్ అవుట్ Mon, May 20, 2024, 06:28 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Mon, May 20, 2024, 06:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సింహాద్రి' Mon, May 20, 2024, 06:23 PM