'మిస్టర్ బచ్చన్' US షెడ్యూల్‌కు సంబంధించిన అప్‌డేట్

by సూర్య | Thu, May 09, 2024, 07:18 PM

మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజతో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి తెలిసందే. ఈ సినిమాకి మిస్టర్ బచ్చన్ - నామ్ తో సునా హోగా అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. చిత్ర యూనిట్ ఇప్పటివరకు లక్నో మరియు హైదరాబాద్‌లో చిత్రీకరించింది మరియు తదుపరి మేజర్ షెడ్యూల్ యునైటెడ్ స్టేట్స్‌లో జరుగుతుంది. తాజా అప్‌డేట్ ఏమిటంటే, మిస్టర్ బచ్చన్ బృందం ఈ వారం అమెరికాకు వెళ్లనుంది. యూఎస్ షెడ్యూల్‌లో పాటలు, కీలకమైన టాకీ సన్నివేశాలను చిత్రీకరిస్తారని యూనిట్ తెలిపింది.


భారతీయ పారిశ్రామికవేత్త సర్దార్ ఇందర్ సింగ్‌పై దాదాపు 3 రోజుల పాటు జరిగిన నిజ జీవిత ఆదాయపు పన్ను దాడి ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. రవితేజ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సత్య, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Latest News
 
'గుడ్ బ్యాడ్ అగ్లీ' విడుదల ఎప్పుడంటే...! Mon, May 20, 2024, 01:43 PM
'ఆ ఒక్కటి అడక్కు' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Mon, May 20, 2024, 01:41 PM
'మిరాయి' నుండి మంచు మనోజ్ ఫస్ట్ లుక్ అవుట్ Mon, May 20, 2024, 01:39 PM
1 సంవత్సరం పూర్తి చేసుకున్న 'బిచ్చగాడు 2' Mon, May 20, 2024, 01:37 PM
'ఇండియన్ 2' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Mon, May 20, 2024, 01:35 PM