సందీప్ కిషన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'SK30' టీమ్

by సూర్య | Tue, May 07, 2024, 03:05 PM

తెలుగు నటుడు సందీప్ కిషన్ తన తదుపరి ప్రాజెక్ట్ ని త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'SK30' అనే టైటిల్ ని పెట్టారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా హీరో సందీప్ కిషన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది.

రావు రమేష్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభమవుతుంది. ఈ ప్రాజెక్ట్‌కి కథ, స్క్రీన్‌ప్లే మరియు సంభాషణలకు ప్రముఖ రచయిత ప్రసన్న కుమార్ బాధ్యత వహిస్తున్నారు.


హాస్య మూవీస్‌, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజేష్ దండా నిర్మిస్తుండగా, బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM