భారీ బడ్జెట్‌తో ఎపిక్ వార్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్న 'స్వయంభూ' టీమ్

by సూర్య | Tue, May 07, 2024, 02:58 PM

భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'స్వయంభూ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రంలో నిఖిల్ సరసన జోడిగా సంయుక్త నటిస్తుంది. తాజాగా స్వయంభూ టీమ్ ఎపిక్ వార్ ఎపిసోడ్‌ను భారీ స్థాయిలో చిత్రీకరిస్తోంది అని సమాచారం. 12 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్‌ను 8 కోట్ల బడ్జెట్‌తో షూట్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో నభానటేష్ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ పాన్ ఇండియా సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఎం ప్రభాహరన్ సెట్టింగ్స్ డిజైన్ చేయగా, వాసుదేవ్ మునెప్పగారి డైలాగ్స్ అందిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM