'భజే వాయు వేగం' ఫస్ట్ సింగల్ ప్రోమో అవుట్

by సూర్య | Tue, May 07, 2024, 02:54 PM

నూతన దర్శకుడు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'బజే వాయు వేగం' అనే టైటిల్ ని మూవీ మేక్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ప్రోమోని సెట్ అయ్యిందే అనే టైటిల్ తో విడుదల చేసారు. అంతేకాకుండా మే 9న ఉదయం 9:09 గంటలకి పూర్తి పాటని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సినిమాలో ఐశ్వర్యా మీనన్ కథానాయికగా నటిస్తుంది. హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాని యువి క్రియేషన్స్ సమర్పణలో యువి కాన్సెప్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. పి అజయ్ కుమార్ రాజు సహ నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రానికి రధన్ సంగీతం సమకూర్చనున్నారు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM