రీ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న 'RRR' హిందీ వెర్షన్

by సూర్య | Mon, May 06, 2024, 05:44 PM

SS రాజమౌళి డైరెక్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరోస్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'RRR' సినిమా థియేటర్లలో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఇటీవలే MM కీరవాణి స్వరపరచిన నాటు నాటు పాట ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును గెలుచుకుని ప్రతి భారతీయుడు గర్వించేలా చేసింది. RRR యొక్క  హిందీ డిస్ట్రిబ్యూటర్ అయిన పెన్ మూవీస్ ఈ సినిమా హిందీ వెర్షన్‌ను రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఖచ్చితమైన విడుదల తేదీ ఇంకా వెల్లడించలేదు.


ఈ యాక్షన్ డ్రామా మూవీలో అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM