కల్కి 2898 AD కాన్సెప్ట్ ఇంతకు ముందెన్నడూ ప్రయత్నించలేదు - సర్వజ్ఞ కుమార్

by సూర్య | Sat, May 04, 2024, 05:42 PM

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాకి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ కల్కి 2898 AD అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. అమితాబ్ బచ్చన్ ఇంట్రడక్షన్ గ్లింప్సె తో ప్రభాస్ నటించిన కల్కి 2898 AD కోసం ఎదురుచూపులు విపరీతంగా పెరిగాయి. మొదటి నుండి, మేకర్స్ కల్కి 2898 ADని సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ప్రచారం చేసారు, కానీ తాజా గ్లింప్సె లో అమితాభాను అశ్వత్థామగా చూపించారు. కాబట్టి, ఈ సినిమా పౌరాణిక మరియు సైన్స్ మిక్స్‌గా ఉంటుంది అని టాక్.


ఇటీవలే ఆహా యొక్క మై డియర్ దొంగ చిత్రానికి దర్శకత్వం వహించిన సర్వజ్ఞ కుమార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం గురించి ఆసక్తికరమైన అప్డేట్ ని ఇచ్చాడు. నేను కల్కి 2898 AD కి అదనపు రచయితగా పనిచేశాను. నేను ఏదీ వెల్లడించలేను, కానీ ఇంతకు ముందు ఎవరూ ప్రయత్నించని ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుందని నేను చెప్పగలను అని అన్నారు.

ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటిస్తుంది. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో కమల్ హాసన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ మరియు ఇతరులు కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ హై బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా జూన్ 27, 2024న విడుదల కానుంది.

Latest News
 
'టర్బో' సౌత్ కొరియా రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 03:57 PM
3.2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'లవ్ మి - ఇఫ్ యు డేర్' ట్రైలర్ Sat, May 18, 2024, 03:49 PM
బడ్డీ నుండి 'ఆ పిల్ల కనులే' సాంగ్ మేకింగ్ వీడియో అవుట్ Sat, May 18, 2024, 03:46 PM
OTT ప్లాట్‌ఫారమ్‌లో ట్రేండింగ్ అవుతున్న 'లవ్ గురు' Sat, May 18, 2024, 03:43 PM
అన్ని మ్యూజిక్ ప్లాటుఫార్మ్స్ లో అందుబాటులోకి వచ్చిన హరోమ్ హరలోని 'మురుగుడి మాయ' సాంగ్ Sat, May 18, 2024, 03:41 PM