త్వరలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'లాల్ సలామ్'

by సూర్య | Wed, May 01, 2024, 02:51 PM

ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'లాల్ సలామ్' చిత్రం ఫిబ్రవరి 9, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా త్వరలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్ట్రీమింగ్ ప్లాట్ఫారం త్వరలోనే అధికారకా విడుదల తేదీని ప్రకటించనుంది.

ఈ సినిమాలో రజనీ ముంబైకి చెందిన మొయిదీన్ భాయ్ అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. లాల్ సలామ్ సినిమా క్రికెట్ మరియు హిందూ-ముస్లిం మత ఘర్షణల నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా. ఈ చిత్రంలో భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌, విష్ణు విశాల్ మరియు విక్రాంత్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.


లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో తెలుగు నటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్ రజనీకాంత్ సోదరిగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
'రాజు యాదవ్' నాలగవ సింగల్ ని విడుదల చేయనున్న స్థార్ డైరెక్టర్ Tue, May 21, 2024, 08:45 PM
తన సినీ కెరీర్‌ను వదిలేయనున్న స్టార్ హీరోయిన్ Tue, May 21, 2024, 08:43 PM
'రత్నం' డిజిటల్ అరంగేట్రం ఎప్పుడంటే...! Tue, May 21, 2024, 08:41 PM
త్వరలో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్న 'యక్షిణి' Tue, May 21, 2024, 08:37 PM
క్రేజీ బ్యాక్‌డ్రాప్‌లో అల్లు అర్జున్ 'పుష్ప 2' షూటింగ్ Tue, May 21, 2024, 06:51 PM