'NBK109' సెట్స్ లో జాయిన్ అయ్యిన బాబీ డియోల్

by సూర్య | Wed, Apr 24, 2024, 05:46 PM

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో తన తదుపరి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా ఎన్‌బికె 109 అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. మహా శివరాత్రి శుభ సందర్భంగా, NBK109 గ్లింప్సె ని మూవీ మేకర్స్ విడుదల చేసారు.


తాజాగా ఇప్పుడు, హనుమాన్ జయంతి సందర్భంగా మూవీ మేకర్స్ బాలయ్య అభిమానులకు మరియు సినీ ప్రేమికులకు మరో పెద్ద అప్‌డేట్ అందించారు. బహుముఖ నటుడు బాబీ డియోల్ ఈ సినిమా కోసం బోర్డులోకి వచ్చినట్లు ప్రకటించారు. బాలీవుడ్ నటుడికి మూవీ మేకర్స్ ఘనంగా స్వాగతం పలికారు.

NBK109లో చాందిని చౌదరి మరియు ఊర్వశి రౌతేలా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగ వంశీ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమా సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీత అందిస్తున్నారు.

Latest News
 
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM
తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసిన సిద్ధు జొన్నలగడ్డ Sat, May 18, 2024, 06:10 PM
బుక్ మై షోలో "OG" క్రేజ్ Sat, May 18, 2024, 06:09 PM