'మిరాయ్' సెట్స్‌ లో మంచు మనోజ్

by సూర్య | Wed, Apr 24, 2024, 04:10 PM

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'మిరాయ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజా అప్‌డేట్ ప్రకారం, నటుడు ఇటీవలే మిరాయ్ సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. ఇదే విషయాన్ని పరోక్షంగా తన సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో నటుడు ప్రకటించాడు.

ఈ సినిమా ఏప్రిల్ 18, 2025న పెద్ద స్క్రీన్‌లపై 2D మరియు 3D ఫార్మాట్‌లలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ మరియు చైనీస్ భాషలలో విడుదల కానుంది. ఈ అడ్వెంచరస్ మూవీలో హాయ్ నాన్న నటి రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుంది.


ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లను గౌర హరి అందించనున్నారు. కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్, సుజిత్ కుమార్ కొల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, టిజి విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై నిర్మిస్తున్నారు.

Latest News
 
'మ్యూజిక్ షాప్ మూర్తి' నుండి అంతరంతమూర్తి లిరికల్ వీడియో అవుట్ Mon, May 06, 2024, 03:20 PM
కృష్ణమ్మ : కృష్ణమ్మ కథలు విత్ కొరటాల శివ వీడియో రిలీజ్ Mon, May 06, 2024, 03:18 PM
'ఆ ఒక్కటి అడక్కు' 2 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Mon, May 06, 2024, 03:15 PM
'భలే ఉన్నాడే' టీజర్ అవుట్ Mon, May 06, 2024, 03:08 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'మంజుమ్మెల్ బాయ్స్' Mon, May 06, 2024, 02:53 PM