'వేట్టైయాన్‌' లో అమితాబ్ బచ్చన్ పాత్రపై లేటెస్ట్ బజ్

by సూర్య | Tue, Apr 23, 2024, 04:56 PM

జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ తో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'వేట్టైయన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టైటిల్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.


ఈ సినిమా అక్టోబర్ 2024లో పెద్ద స్క్రీన్‌లలోకి రానుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమాలో బిగ్ బి స్పెషల్ జడ్జ్ పాత్రలో కనిపించనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.


వేట్టైయన్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్, GM సుందర్, రోహిణి, రావు రమేష్, రమేష్ తిలక్ మరియు రక్షణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

Latest News
 
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM
'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో Fri, May 03, 2024, 08:49 PM
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM