'ప్రతినిధి 2' ని USAలో విడుదల చేస్తున్న ప్రముఖ బ్యానర్

by సూర్య | Tue, Apr 23, 2024, 03:45 PM

టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ కెరీర్‌లో ప్రతినిధి  సినిమా మైలురాయిగా నిలిచింది. ప్రతినిధి 2 సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉంది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క USA రైట్స్ ని కాగ్నిర్ సినీ క్రియేషన్స్ బ్యానర్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.

ప్రముఖ బెంగాలీ నటుడు జిషు సేన్‌గుప్తా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కుమార్రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Latest News
 
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM
'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో Fri, May 03, 2024, 08:49 PM
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM