'ది గోట్' సెకండ్ సింగల్ విడుదల అప్పుడేనా?

by సూర్య | Mon, Apr 22, 2024, 08:33 PM

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తన తదుపరి చిత్రాన్ని వెంకట్ ప్రభుతో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఈ సినిమాకి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (G.O.A.T.) అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా సెప్టెంబర్ 5, 2024న గ్రాండ్ విడుదల కానుంది.


ఇటీవలే మూవీ మేకర్స్ ఈ మెగా-బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్‌యొక్క ఫస్ట్ సింగల్ ని విజిల్ పోడు అనే టైటిల్ తో విడుదల చేయగా సాంగ్ కి భారీ స్పందన లభించింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ జూన్ 22న నటుడి పుటినరోజు సందర్భంగా ఈ సినిమాలోని సెకండ్ సింగల్ ని విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో విజయ్ సరసన హ్యాపెనింగ్ నటి మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కలాపతి, కళపతి ఎస్ అఘోరం, కలపతి ఎస్ గణేష్, కళపతి ఎస్ సురేష్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు.

Latest News
 
యాంకర్ ప్రదీప్ నూతన చిత్రం ప్రారంభం Thu, Oct 17, 2024, 11:47 PM
పుష్ప కోసం 1600 కిమీ సైకిల్ యాత్ర చేసిన అభిమాని Thu, Oct 17, 2024, 11:46 PM
‘రివాల్వర్ రీటా’ టీజర్ విడుదల Thu, Oct 17, 2024, 11:45 PM
మిస్ ఇండియా 2024 విన్నర్ నిఖిత పోర్వాల్‌ Thu, Oct 17, 2024, 11:43 PM
చిన్నారికి అండగా నిలిచిన రామ్ చరణ్, వీడియో వైరల్ Thu, Oct 17, 2024, 11:42 PM