ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న నిధి అగ ర్వాల్‌

by సూర్య | Sun, Apr 21, 2024, 10:59 AM

సినీ రంగంలో ప్రేమను నిలబెట్టుకున్నవాళ్లూ ఉన్నారు. అనివార్య కారణాల వల్ల ప్రియుల నుంచి విడిపోయినవారూ ఉన్నారు. ప్రేమలో విఫలమై పెళ్లికి దూరం అయిన వాళ్లు కూడా ఉన్నారు.ప్రస్తుతం హీరోయిన్ నిధి అగర్వాల్‌ రెండో కోవకు చెందినవారిలో ఉన్నారు. ఈ ఉత్తరాది భామ మున్నా మైఖేల్‌ అనే హిందీ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత టాలీవుడ్‌ నుంచి పిలుపు రావడంతో సవ్యసాచి అనే చిత్రంతో అరంగేట్రం చేశారు. కానీ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినప్పటికీ.. నిధి అగర్వాల్‌ గుర్తింపు అయితే వచ్చింది.ఆ తరువాత ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా నటించి సక్సెస్ అందుకున్నారు. ఆపై కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా ఫలితం లేకపోయింది. ఇక తమిళంలో జయం రవికి జంటగా భూమి అనే చిత్రంతో పరిచయమయ్యారు. ఆ చిత్రం ఓటీటీలో విడుదల కావడంతో ఈమె కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. ఆ తరువాత నటుడు శింబు సరసన ఈశ్వరన్‌ చిత్రంలో నటించారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత ఉదయనిధిస్టాలిన్‌తో కలిసి కలకతలైవన్‌ చిత్రంలో కనిపించారు. అలా ముగ్గురు ప్రముఖ హీరోలతో చిత్రాలు చేసినా, అందం, పరువం నిండుగా ఉన్నా, నిధి అగర్వాల్‌ కెరీర్‌లో హైప్‌ రాకపోవడం గమనార్హం. అయితే తాజాగా నటుడు ప్రభాస్‌తో జత కట్టే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.


 


ఇదిలా ఉంటే నిధి అగ ర్వాల్‌ ప్రేమ వ్యవహారం గురించి రకరకాల వార్తలొస్తున్నాయి. కాగా ఒక నటుడితో పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ బ్యూటీకి అదీ కాస్తా రివర్స్‌ అయినట్లు తాజా సమాచారం. ప్రియుడి గురించి కొన్ని చేదు సంఘటనలు తెలియడంతో అతనితో బ్రేకప్‌ చేసుకున్నట్లు ప్రచారం వైరల వుతోంది. అంతే కాదు ఇప్పుడు ప్రేమ, దోమా లేదంటూ నటనపై పూర్తిగా దృష్టి సారించాలని నిధి అగర్వాల్‌ నిర్ణయించుకున్నారనేది లేటేస్ట్ టాక్.


 


 

Latest News
 
'కల్కి 2898AD' UK థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Wed, May 29, 2024, 07:19 PM
'సూర్య 44' లో ఎడిటర్ గా షఫీక్ మొహమ్మద్ అలీ Wed, May 29, 2024, 07:16 PM
ఓపెన్ అయ్యిన 'గం గం గణేశ' బుకింగ్స్ Wed, May 29, 2024, 07:14 PM
వరుణ్ తేజ్ తదుపరి చిత్రాన్ని నిర్మించనున్న స్టార్ డైరెక్టర్ Wed, May 29, 2024, 07:13 PM
'యేవమ్' ర్యాప్ సాంగ్ అవుట్ Wed, May 29, 2024, 07:08 PM