100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి'

by సూర్య | Fri, Apr 19, 2024, 08:23 PM

విద్యాధర్ కగిత దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్ నటించిన 'గామి' సినిమా మహా శివరాత్రి శుభ సందర్భంగా మార్చి 8, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క OTT హక్కులను జీ5 సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.


ఇటీవలే ఈ సినిమా ఏప్రిల్ 12న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా జీ5 లో 100 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని డిజిటల్ ప్లాట్ఫారం అధికారకంగా సోషల్ మీడియాలో పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.

ఈ సినిమాలో విశ్వక్సేన్ సరసన చాందిని చౌదరి జోడిగా నటిస్తుంది. MG అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి మరియు హారిక పెడద ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
వెల్లడయిన ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వెనుక రహస్యం Fri, May 17, 2024, 04:54 PM
నేడు స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న 'బంగార్రాజు' Fri, May 17, 2024, 04:44 PM
విష్ణు మంచు 'కన్నప్ప' లో కాజల్ అగర్వాల్ కీలక పాత్ర Fri, May 17, 2024, 04:42 PM
'SSMB29' కాస్టింగ్ రూమర్స్ పై అధికారిక స్పష్టత Fri, May 17, 2024, 04:39 PM
త్వరలో విడుదల కానున్న 'బేబీ జాన్‌' రిలీజ్ డేట్ Fri, May 17, 2024, 04:30 PM