'పుష్ప 2' హిందీ హక్కుల కోసం అనిల్ థాడాని ఎంత చెల్లించాడంటే...!

by సూర్య | Fri, Apr 19, 2024, 05:09 PM

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2019లో బ్లాక్‌బస్టర్ మూవీస్ లో ఒకటైన పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్ గా పుష్ప 2: ది రూల్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే మూవీ మేకర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప 2 యొక్క పవర్-ప్యాక్డ్ టీజర్‌ను విడుదల చేసారు. టీజర్ మూవీ పై భారీ హైప్ ని క్రియేట్ చేసింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కుల కోసం అనిల్ థడాని 200 కోట్లు చెల్లించినట్లు సమాచారం.


ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీసాఫీసర్  పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పుష్ప 2ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Latest News
 
వైట్ మోడ్రన్ డ్రెస్ లో గ్లామరస్ గా దీపికా Fri, May 17, 2024, 11:39 AM
రష్మిక ట్వీట్ వీడియో పై స్పందించిన ప్రధాని Fri, May 17, 2024, 11:37 AM
‘అరవింద సమేత’తో బాధపడ్డాను: ఈషా Fri, May 17, 2024, 11:10 AM
'రామంరాఘవం' లో నాయుడన్న పాత్రలో సునీల్ Thu, May 16, 2024, 07:48 PM
తెలుగు రాష్ట్రాలలో 'రాజు యాదవ్' ని విడుదల చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ Thu, May 16, 2024, 07:47 PM