OTT ఎంట్రీ ఇచ్చేసిన 'ఆర్టికల్ 370'

by సూర్య | Fri, Apr 19, 2024, 03:57 PM

యామీ గౌతమ్ నటించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా ఆర్టికల్ 370 యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జియో సినిమా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు మరియు ఆర్టికల్ 370 ప్రకారం మంజూరు చేయబడిన స్వయంప్రతిపత్తిపై ఆధారపడింది.


ఈ సినిమా ఏప్రిల్ 19న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చినట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఆదిత్య సుహాస్ జంభలే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.


ప్రియమణి, అరుణ్ గోవిల్, రాజేంద్రనాథ్ జుట్షి, దివ్య సేథ్ మరియు ఐరావతి హర్షే ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. జ్యోతి దేశ్‌పాండే, ఆదిత్య ధర్, లోకేష్ ధర్ సంయుక్తంగా ఆర్టికల్ 370ని రూపొందించారు.

Latest News
 
'రామంరాఘవం' లో నాయుడన్న పాత్రలో సునీల్ Thu, May 16, 2024, 07:48 PM
తెలుగు రాష్ట్రాలలో 'రాజు యాదవ్' ని విడుదల చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ Thu, May 16, 2024, 07:47 PM
దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్‌తో ఫహద్ ఫాసిల్ కొత్త చిత్రం Thu, May 16, 2024, 07:44 PM
'బాక్' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా? Thu, May 16, 2024, 07:43 PM
ఆఫీసియల్ : ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కల్కి 2898AD' Thu, May 16, 2024, 07:41 PM