కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి

by సూర్య | Thu, Apr 18, 2024, 10:01 PM

సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో కబీర్ సింగ్ టైటిల్ తో రూపొందించి బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. కబీర్ సింగ్ సినిమాలో నటించిన ఆదిల్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు నా సినీ కెరీర్‌లో ఎందుకు నటించానో అని బాధపడ్డ సినిమా 'కబీర్ సింగ్' మాత్రమే అని అన్నారు. ఆ సినిమాలో కాలేజ్ డీన్ గా నేను నటించానని అదిల్ హుస్సేన్ వెల్లడించారు. నేను ఎన్నిసార్లు నో చెప్పినా ఒకే ఒకసారి షూట్ కు రావాలని అన్నారని అదిల్ హుస్సేన్ పేర్కొన్నారు.ఆ సినిమా కోసం భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని అదిల్ హుస్సేన్ వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. వాళ్లు చెప్పిన సీన్ యాక్ట్ చేసి వచ్చేశానని ఆయన పేర్కొన్నారు.
కబీర్ సింగ్ సినిమా చూశాక ఈ సినిమాలో ఎందుకు నటించానో అని ఫీలయ్యానని ఆదిల్ హుస్సేన్ అన్నారు. నేను స్నేహితుడితో కలిసి సినిమా చూసేందుకు వెళ్లి మధ్యలో బయటకు వచ్చానని ఆదిల్ హుస్సేన్ తెలిపారు. ఆదిల్‌ వ్యాఖ్యలపై సందీప్‌ స్పందిస్తూ.. మిమ్మల్ని కబీర్ సింగ్ సినిమాలో తీసుకున్నందుకు బాధ పడుతున్నానని తెలిపారు. తనకు ప్యాషన్ కంటే అత్యాశ ఎక్కువని అర్థమైందని.. ఏఐ సాయంతో అతని ముఖాన్ని సినిమాలో మార్చేస్తానని.. అప్పుడు సిగ్గు పడాల్సిన అవసరం ఉండదని సందీప్ రెడ్డి స్పందించారు.


 


 


 


 


 


 


 


 

Latest News
 
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్' Wed, May 01, 2024, 09:18 PM
ప్రీపోన్ అయ్యిన మమ్ముట్టి 'టర్బో' Wed, May 01, 2024, 09:14 PM
'సాలార్ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 01, 2024, 09:08 PM
'రంగస్థలం' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, May 01, 2024, 09:04 PM