కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్'

by సూర్య | Thu, Apr 18, 2024, 07:18 PM

మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజతో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి తెలిసందే. ఈ సినిమాకి మిస్టర్ బచ్చన్ - నామ్ తో సునా హోగా అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా 30 రోజుల లక్నో షెడ్యూల్ పూర్తయిందని హరీష్ శంకర్ వెల్లడించారు. ఇంకా సెట్స్ నుండి ఒక ఫోటోను స్టార్ డైరెక్టర్ పోస్ట్ చేశాడు. తదుపరి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరగనుంది, త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

భారతీయ పారిశ్రామికవేత్త సర్దార్ ఇందర్ సింగ్‌పై దాదాపు 3 రోజుల పాటు జరిగిన నిజ జీవిత ఆదాయపు పన్ను దాడి ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. రవితేజ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సత్య, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Latest News
 
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్' Wed, May 01, 2024, 09:18 PM
ప్రీపోన్ అయ్యిన మమ్ముట్టి 'టర్బో' Wed, May 01, 2024, 09:14 PM
'సాలార్ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 01, 2024, 09:08 PM
'రంగస్థలం' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, May 01, 2024, 09:04 PM