'పోటెల్' టీజర్ లాంచ్ చేయనున్న ప్రముఖ డైరెక్టర్

by సూర్య | Thu, Apr 18, 2024, 04:22 PM

సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో యువ చంద్ర కృష్ణ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమకి మూవీ మేకర్స్ 'పొటెల్‌' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా యొక్క టీజర్ ని ఈరోజు సాయంత్రం 5:18 గంటలకి విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా టీజర్ ని స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ లాంచ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి మరియు ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ చిత్రంలో అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రత్యేకమైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించనున్నారు. మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Latest News
 
మోహన్ లాల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'కన్నప్ప' టీమ్ Tue, May 21, 2024, 03:57 PM
త్వరలో విడుదల కానున్న 'భజే వాయు వేగం' ట్రైలర్ Tue, May 21, 2024, 03:56 PM
'సత్యభామ' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే...! Tue, May 21, 2024, 03:53 PM
ప్రొమోషన్స్ ని ప్రారంభించిన 'కల్కి 2898AD' టీమ్ Tue, May 21, 2024, 03:51 PM
లవ్ మి - ఇఫ్ యు డేర్ నుండి 'ఏమవుతుందో' సాంగ్ విడుదలకి తేదీ ఖరారు Tue, May 21, 2024, 03:46 PM