'పారిజాత పర్వం' పెయిడ్ ప్రీమియర్స్ కి తేదీ లాక్

by సూర్య | Wed, Apr 17, 2024, 04:12 PM

సంతోష్ కంభంపాటి రచన మరియు దర్శకత్వంలో చైతన్య రావు ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. క్రైమ్ కామెడీ ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'పారిజాత పర్వం' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్‌ ఈ సినిమాపై భారీ బజ్ ని క్రియేట్ చేసింది.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ ప్రసాద్ ఐమ్యాక్ లో రేపు సాయంత్రం 8 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదలకి సిద్ధంగా ఉంది.

ఈ సినిమాలో ప్రముఖ నటి శ్రద్ధాదాస్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో యువ హాస్యనటుడు వైవా హర్ష, మాళవిక సతీశన్, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై మహీధర్ రెడ్డి మరియు దేవేష్ నిర్మిస్తున్నారు. అనంత సాయి ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఉన్నారు.

Latest News
 
'దేవర' సినిమాపై క్లారిటీ ఇచ్చిన అల్ల‌రి నరేష్ Tue, Apr 30, 2024, 10:15 AM
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 08:55 PM
'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న Mon, Apr 29, 2024, 08:53 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 29, 2024, 08:51 PM
'అమరన్' విడుదల అప్పుడేనా? Mon, Apr 29, 2024, 07:52 PM