సంయుక్త బాలీవుడ్ ఎంట్రీ

by సూర్య | Wed, Apr 17, 2024, 11:33 AM

బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసింది సంయుక్త.. బీ టౌన్ ప్లైట్ఎక్కబోతోంది. ఇక పక్కా ఫ్యామిలీ కథతో రాబోతోంది మార్కెట్ మహాలక్ష్మి.. ఇలా టాలీవుడ్ అప్ డేట్స్ గురించి చూద్దాం. స్టార్ హీరోయిన్ సంయుక్త టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి..  భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్..ఇలా వరుసగా ఐదు సూపర్ హిట్ సినిమాలతో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది. తెలుగులో నిఖిల్ సరసన పాన్ ఇండియా మూవీ స్వయంభుతో పాటు శర్వానంద్ కొత్త చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో సంయుక్త తెచ్చుకున్న క్రేజ్ తో బాలీవుడ్ నుంచి ఆమెకు పిలుపు వచ్చింది


హిందీలో ఓ ఇంట్రెస్టింగ్ బిగ్ ప్రాజెక్ట్ లో ఆఫర్ దక్కించుకుంది సంయుక్త . ఈ ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేసేందుకు ముంబై వెళ్లింది బ్యూటీ. ఎయిర్ పోర్ట్ లో వెళ్తున్న సంయుక్త ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే సంయుక్త తన బాలీవుడ్ మూవీని అనౌన్స్ చేయనుంది. తెలుగుతో పాటు హిందీలోనూ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది సంయుక్త.


బి2పి స్టూడియోస్ బ్యానర్ లో కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను వియస్ ముఖేష్ నిర్వహించారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. అఖిలేష్ కలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న థియేటర్ లో రిలీజ్ కానుంది. మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ ఉండగా, ఈ క్రమంలో దర్శకుడు వియస్ ముఖేష్ మీడియాతో ముచ్చటించి సినిమా గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు.

Latest News
 
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 08:55 PM
'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న Mon, Apr 29, 2024, 08:53 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 29, 2024, 08:51 PM
'అమరన్' విడుదల అప్పుడేనా? Mon, Apr 29, 2024, 07:52 PM
'టిల్లూ క్యూబ్‌' లో పూజ హెడ్గే Mon, Apr 29, 2024, 07:46 PM