భూల్ భూలయ్యా 3 లో ఈ స్టార్ హీరోయిన్లపై క్రేజీ సాంగ్

by సూర్య | Tue, Apr 16, 2024, 07:24 PM

భూల్ భూలయ్యా సినిమా భారతీయ సినిమాలో బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజ్ మరియు మూడవ భాగం భూల్ భూలయ్యా 3 ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటుంది. రెండవ భాగంలో ప్రధాన పాత్ర పోషించిన కార్తీక్ ఆర్యన్ మరోసారి రూహ్ బాబాగా కనిపించనున్నాడు. మొదటి భాగంలో కథానాయికగా నటించిన విద్యాబాలన్ ఈ చిత్రంతో ఫ్రాంచైజీకి తిరిగి రావడంతో ప్రేక్షకులు ఈ చిత్రంపై ఎక్కువ ఆసక్తిని కలిగి ఉన్నారు.


ఈ హర్రర్ కామెడీలో మాధురీ దీక్షిత్ కీలక పాత్ర పోషిస్తుంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, విద్యాబాలన్, మాధురీ దీక్షిత్‌లపై ఓ క్రేజీ సాంగ్ ని మూవీ మేకర్స్ చిత్రీకరించనున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇతర షెడ్యూల్స్‌కి సిద్ధమవుతున్నారు. యానిమల్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన ట్రిప్తి డిమ్రీ ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ కి జోడిగా కనిపించనుంది. ఈ చిత్రం 2024 దీపావళి సందర్భంగా విడుదల కానుంది.

Latest News
 
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 08:55 PM
'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న Mon, Apr 29, 2024, 08:53 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 29, 2024, 08:51 PM
'అమరన్' విడుదల అప్పుడేనా? Mon, Apr 29, 2024, 07:52 PM
'టిల్లూ క్యూబ్‌' లో పూజ హెడ్గే Mon, Apr 29, 2024, 07:46 PM