'బడే మియాన్ చోటే మియాన్' లేటెస్ట్ కలెక్షన్స్

by సూర్య | Tue, Apr 16, 2024, 06:46 PM

అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌ నటించిన మల్టీస్టారర్ మూవీ బడే మియాన్ చోటే మియాన్‌ ఏప్రిల్ 11, 2024 ఈద్ సందర్భంగా గ్రాండ్ రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా సోమవారం నాడు దాదాపు 2.25 కోట్ల ఆల్ ఇండియా నెట్‌ని వసూలు చేసింది. ఈ సినిమా 5 రోజుల ఇండియా నెట్ మొత్తం కేవలం 40 కోట్ల రూపాయలకి చేరుకుంది.

పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్, అలయ ఎఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ మిశ్రా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జాకీ భగ్నాని, వాసు భగ్నాని, దీప్శిఖా దేశ్‌ముఖ్ మరియు అలీ అబ్బాస్ జాఫర్ నిర్మిస్తున్నారు.

Latest News
 
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 08:55 PM
'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న Mon, Apr 29, 2024, 08:53 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 29, 2024, 08:51 PM
'అమరన్' విడుదల అప్పుడేనా? Mon, Apr 29, 2024, 07:52 PM
'టిల్లూ క్యూబ్‌' లో పూజ హెడ్గే Mon, Apr 29, 2024, 07:46 PM