యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టిస్తున్న 'పుష్ప 2' టీజర్

by సూర్య | Mon, Apr 15, 2024, 03:25 PM

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2019లో బ్లాక్‌బస్టర్ మూవీస్ లో ఒకటైన పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్ గా పుష్ప 2: ది రూల్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే మూవీ మేకర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప 2 యొక్క పవర్-ప్యాక్డ్ టీజర్‌ను విడుదల చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో 138 గంటలగా ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పుష్ప 2ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Latest News
 
తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన కోలీవుడ్ స్టార్ హీరో Fri, Sep 20, 2024, 04:15 PM
నేడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి Fri, Sep 20, 2024, 04:09 PM
'మ్యాడ్ స్క్వేర్' నుండి ఎనర్జిటిక్ లడ్డు గానీ పెళ్లి సాంగ్ అవుట్ Fri, Sep 20, 2024, 04:09 PM
ఆపిల్ సినిమాస్ లో ఓపెన్ అయ్యిన 'దేవర' బుకింగ్స్ Fri, Sep 20, 2024, 04:04 PM
ANR శతజయంతి వేడుకల సందర్భంగా బాలకృష్ణ నివాళి Fri, Sep 20, 2024, 03:57 PM