ఆ సినిమా సీక్వెల్ వారిద్దరూ చేస్తే బాగుంటుంది

by సూర్య | Sat, Apr 13, 2024, 10:09 PM

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో మెగాస్టార్‌ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రానికి సీక్వెల్‌లో రామ్‌చరణ్‌, జాన్వీకపూర్‌ కలిసి యాక్ట్‌ చేస్తే చూడాలన్నది తన కల అని దాని కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నా అని ఆయన అన్నారు. త్వరలోనే జరగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. మార్చిలో జరిగిన సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2024లో భాగంగా జరిగిన కార్యక్రమంలో రాజీవ్‌ మసంద్‌ అడిగిన పలు ప్రశ్నలకు చిరంజీవి సమాధానమిచ్చారు. ‘‘సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఉన్నప్పుడు నేనెప్పుడూ పెద్ద స్టార్‌ని అవుతానని, మెగాస్టార్‌ ట్యాగ్‌ వస్తుందని అనుకోలేదు. నా కష్టం, ప్రతిభపై ఉన్న నమ్మకంతో మంచి స్థానంలో ఉంటానని అనుకున్నా. ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకున్నా. దాని ఫలితమే ఈ రోజు ఈ స్థ్థాయిలో ఉన్నా. నాకు మంచి క్యారెక్టర్స్‌ ఇచ్చిన దర్శకులకు ధన్యవాదాలు. నా అభిమానుల ప్రేమను ఎప్పటికీ కొలవలేను. నా అభిమానులు  మాస్‌ సినిమాల్లో నన్ను చూడాలనుకునేవారు. నాకేమో క్లాసికల్‌ సినిమాలు చేయాలని ఉండేది. ‘ఖైదీ’ నాకు  స్టార్‌ స్టేటస్  ఇచ్చింది. నన్ను చాలా పైకి తీసుకెళ్లింది. అందులోని యాక్షన్‌ సీన్స్‌, డ్యాన్స్‌లు,, భావోద్వేగ సన్నివేశాలు మంచి పేరు తెచ్చాయి. ఆ తర్వాత వచ్చిన ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘శుభలేఖ’లాంటి చిత్రాలను కూడా ప్రేక్షకులు చక్కగా ఆదరించారు.

Latest News
 
'కల్కి 2898AD' UK థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Wed, May 29, 2024, 07:19 PM
'సూర్య 44' లో ఎడిటర్ గా షఫీక్ మొహమ్మద్ అలీ Wed, May 29, 2024, 07:16 PM
ఓపెన్ అయ్యిన 'గం గం గణేశ' బుకింగ్స్ Wed, May 29, 2024, 07:14 PM
వరుణ్ తేజ్ తదుపరి చిత్రాన్ని నిర్మించనున్న స్టార్ డైరెక్టర్ Wed, May 29, 2024, 07:13 PM
'యేవమ్' ర్యాప్ సాంగ్ అవుట్ Wed, May 29, 2024, 07:08 PM