లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో మంచి మెసేజ్‌ ఉంటుంది

by సూర్య | Sat, Apr 13, 2024, 10:06 PM

బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యంలో లేకుండా నటిగా కెరీర్‌ ప్రారంభించి స్టార్‌గా ఎదిగారు విద్యాబాలన్. హీరోయిన్  ఓరియెంటెడ్‌ చిత్రాలతో మెప్పించి తనకంటూ ఓ ట్రాక్‌ను, గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంగ్లిష్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో మంచి మెసేజ్‌ ఉంటుంది. వాటిని ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తారు. కొందరు నటులు ఆ విషయాన్ని సహించలేరు. ఎవరు అంగీకరించినా లేకున్నా ఇది మాత్రం నిజం. నేను ఎక్కువగా ఇలాంటి సినిమాలే చేస్తాను కాబట్టి నాతో నటించేందుకు కొందరు స్టార్లు ఇష్టపడరు. ఈ విషయంలో నేనేం బాధపడను. నాకంటే బాలీవుడ్‌లో ఓ క్రేజ్‌ ఉంది. సినిమా పరిశ్రమలో నెపోటిజం ఉందంటే నేను అంగీకరించను. ఒకవేళ నెపోటిజం ఉండి ఉంటే తారల పిల్లంతా సక్సెస్‌ అయ్యేవారు. పరిశ్రమ ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి సంబంధించింది కాదు. నేను కిందిస్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చాను. కాబట్టే నాపై ప్రేక్షకులకు ప్రత్యేక అభిమానం ఉంది. నా కుటుంబంలో ఎవరైనా సినీ పరిశ్రమకు చెందినవారు ఉన్నట్లైతే నా గుర్తింపు వేరుగా ఉండేది. నాకు వచ్చిన అవకాశాలన్నీ నటన వల్ల వచ్చాయి కానీ, నా నేపథ్యం చూసి రాలేదు’ అని అన్నారు. ప్రస్తుతం విద్యాబాలన్‌ నటించిన ‘ప్యార్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. కార్తీక్‌ ఆర్యన్‌ కీలక పాత్రలో తెరకెక్కుతున్న  ‘భూల్‌ భులయ్యా 3’లో నటిస్తున్నారు. ఇందులో ఆమె కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ ఏడాది దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 

Latest News
 
ఓపెన్ అయ్యిన 'ఇట్స్ కంప్లికేటేడ్' అడ్వాన్స్ బుకింగ్స్ Sat, Feb 08, 2025, 08:47 PM
లెహంగాలో కళ్లు చెదిరేలా మెరిసిపోతున్న కృతి శెట్టి Sat, Feb 08, 2025, 08:02 PM
త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తా. మీ అందరినీ కలుస్తా : కన్నడ నటుడు దర్శన్‌ Sat, Feb 08, 2025, 07:37 PM
'అఖండ 2' ఫస్ట్ లుక్ విడుదల అప్పుడేనా? Sat, Feb 08, 2025, 06:49 PM
'నిలవకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే..! Sat, Feb 08, 2025, 06:43 PM