మంచి అవకాశాలు వచ్చాయి కాబట్టే, ఈ స్థాయిలోకి వచ్చాను

by సూర్య | Sat, Apr 13, 2024, 10:04 PM

'ఛలో’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'గీత గోవిందం'తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని స్టార్‌ హీరోల సరసన అవకాశాలు అందుకుంది. 'పుష్ప' చిత్రంతో ఒక్కసారిగా నేషనల్‌ క్రష్‌ అయిపోయింది. ఇప్పుడు గ్లోబల్‌ ఫేవరెట్‌గా మారింది. ప్రస్తుతం సౌత్ ,  నార్త్‌ సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల 'యానిమల్‌' చిత్రంతో సూపర్‌ సక్సెస్‌ అందుకున్న ఆమె తాజా ఇంటర్వ్యూలో  సక్సెస్‌ అండ్‌ ఫేమ్‌ గురించి మాట్లాడింది. ‘‘నేను సక్సెస్‌ గురించి పెద్దగా ఆలోచించను. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని నటిగా ఫెయిల్‌ కాకూడదని ఆలోచిస్తానంతే. జయాపజయాల గురించి పట్టించుకోను. ఇండస్ట్రీలో నాకంటే అందమైన, తెలివైన అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. వాళ్లకూ అద్భుతమైన ట్యాలెంట్‌ ఉంది. అయితే మనల్ని మనం నిరూపించుకునే అవకాశాలు అతి కొద్దిమందికే వస్తుంది. నాకు కూడా అలాంటి అవకాశాలు వచ్చాయి కాబట్టే నేను ఇప్పుడు ఈ పొజిషన్ కు వచ్చాను. నన్ను గుర్తించిన డైరెక్టర్స్‌, ప్రొడ్యూసర్స్‌లకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. అయితే కెరీర్‌లో సాధించిన సక్సెస్‌ను, అలాగే ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్‌ను పట్టించుకోకూడదు. ఏ ఫీల్డ్‌లోనైనా అవి సహజం. ఇటీవలే ఈ విషయాన్ని నేను  తెలుసుకున్న. మనం చేసే ప్రతీ పనిని ఆడియెన్స్‌ బాగా గమనిస్తారు.  ప్రశంసలు, విమర్శలు లాంటివి కూడా మనకు ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటాయి. వాటి గురించి ఆలోచిస్తే మనం మానసికంగా కుంగిపోతాం. జీవితంలో ఇక ముందుకు సాగలేం. అందుకే వాటిని నేను అసలు పట్టించుకోను’’ అని అన్నారు.

Latest News
 
'కల్కి 2898AD' UK థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Wed, May 29, 2024, 07:19 PM
'సూర్య 44' లో ఎడిటర్ గా షఫీక్ మొహమ్మద్ అలీ Wed, May 29, 2024, 07:16 PM
ఓపెన్ అయ్యిన 'గం గం గణేశ' బుకింగ్స్ Wed, May 29, 2024, 07:14 PM
వరుణ్ తేజ్ తదుపరి చిత్రాన్ని నిర్మించనున్న స్టార్ డైరెక్టర్ Wed, May 29, 2024, 07:13 PM
'యేవమ్' ర్యాప్ సాంగ్ అవుట్ Wed, May 29, 2024, 07:08 PM