'బడే మియాన్ చోటే మియాన్' డే వన్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...!

by సూర్య | Fri, Apr 12, 2024, 07:22 PM

అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌ నటించిన మల్టీస్టారర్ మూవీ 'బడే మియాన్ చోటే మియాన్‌' ఏప్రిల్ 11, 2024 ఈద్ సందర్భంగా గ్రాండ్ రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకున్తుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద విడుదలైన తొలి రోజున 36.33 కోట్ల గ్రాస్ ని వసూళ్లు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్, అలయ ఎఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ మిశ్రా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జాకీ భగ్నాని, వాసు భగ్నాని, దీప్శిఖా దేశ్‌ముఖ్ మరియు అలీ అబ్బాస్ జాఫర్ నిర్మిస్తున్నారు.

Latest News
 
OTTలోకి శ్రీవిష్ణు ‘స్వాగ్’ Fri, Oct 25, 2024, 03:00 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'స్వాగ్' Fri, Oct 25, 2024, 02:58 PM
ఈ వారం OTTలో విడుదల కానున్న సిరీస్ మరియు సినిమాలు Fri, Oct 25, 2024, 02:53 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Oct 25, 2024, 02:48 PM
సాలిడ్ టీఆర్పీని నమోదు చేసిన 'గుంటూరు కారం' Fri, Oct 25, 2024, 02:42 PM