'టేనంట్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్

by సూర్య | Fri, Apr 12, 2024, 04:29 PM

యుగంధర్ దర్శకత్వంలో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యం రాజేష్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'టేనంట్' అనే టైటిల్ ని లాక్ చేసారు. టెనెంట్ సినిమా కుటుంబ ప్రేక్షకులను రంజింపజేయడానికి రూపొందించబడిన ఒక సాధారణ, భావోద్వేగ హత్య మిస్టరీ చిత్రం.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క గ్రాండ్ ట్రైలర్ రిలీజ్ లాంచ్ ఈవెంట్ ని ఈరోజు సాయంత్రం 6 గంటలకి హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

ఏప్రిల్ 19న ఈ సినిమా థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి వైఎస్ శ్రీనివాస్ శర్మ కథను అందించగా, సాహితీ సాగర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి యుగేందర్ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందించారు.


మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ఆడుకలం నరేన్, ఎస్తేర్ నొరోన్హా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM