కల్కి 2898 AD షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Sun, Mar 03, 2024, 05:42 PM

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాకి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ కల్కి 2898 AD అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. త్వరలో ఈ సినిమా టీజర్ విడుదల కానుండడంతో అభిమానుల్లో, సాధారణ ప్రేక్షకుల్లో సందడి నెలకొంది. తాజా అప్‌డేట్ ప్రకారం ఈ చిత్రం యొక్క చివరి షెడ్యూల్ ఇటలీలో ప్రారంభం కానుండగా, ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్-ఇండియా బిగ్గీ ప్రపంచవ్యాప్తంగా మే 9, 2024న విడుదల కానుంది. ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటిస్తుంది. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో కమల్ హాసన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్,మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ మరియు ఇతరులు కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ హై బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు Sun, Jan 12, 2025, 09:13 PM
'మజాకా' ఆన్ బోర్డులో ప్రముఖ నటి Sun, Jan 12, 2025, 09:07 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'గరివిడి లక్ష్మి' ఫస్ట్ సింగల్ Sun, Jan 12, 2025, 09:03 PM
'నాగబంధం' నుండి రుద్రా లుక్ ని లాంచ్ చేయనున్న రానా Sun, Jan 12, 2025, 08:59 PM
23 ఏళ్ళ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న నాగ్ హీరోయిన్ Sun, Jan 12, 2025, 08:51 PM