వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'బ్రో'

by సూర్య | Sun, Mar 03, 2024, 05:39 PM

సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ నటించిన 'బ్రో' సినిమా జూలై 28, 2023న ప్రపంచవ్యాప్తంగా పెద్ద తెరపైకి వచ్చింది. ఈ సినిమా తమిళ చిత్రం వినోదయ సితం యొక్క అధికారిక రీమేక్. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా మార్చి 8, 2024 సాయంత్రం 06.00 గంటలకు జీ సినిమాలు ఛానెల్‌లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుంది.

ఈ ఫాంటసీ కామెడీ డ్రామాలో ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో కేతిక శర్మ, బ్రహ్మానందం, రోహిణి మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి మరియు రాజా చెంబోలు కూడా సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.

Latest News
 
తమిళ నటుడు, రాజకీయ నాయకుడు అరుల్మణి కనుమూత Fri, Apr 12, 2024, 10:10 PM
2.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'లక్కీ బాస్కర్' టీజర్ Fri, Apr 12, 2024, 08:36 PM
'వేట్టైయాన్‌' లో తన పాత్ర గురించి ఆసక్తికరమైన అప్డేట్ ని వెల్లడించిన ఫహద్ ఫాసిల్ Fri, Apr 12, 2024, 08:32 PM
రీ-రిలీజ్ కి సిద్ధంగా ఉన్న 'సై' Fri, Apr 12, 2024, 08:30 PM
నిహారిక కొణిదెల తొలి చలనచిత్రానికి క్రేజీ టైటిల్ ఖరారు Fri, Apr 12, 2024, 08:28 PM