ఆసక్తికరంగా 'వళరి' ట్రైలర్

by సూర్య | Fri, Mar 01, 2024, 05:17 PM

బ్యూట్య్ క్వీన్ రితికా సింగ్ 'వళరి' అనే హారర్ థ్రిల్లర్‌ తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధం అవుతుంది. మృతిక సంతోషిని దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 6 నుండి తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ETV విన్‌లో ప్రసారానికి అందుబాటులో ఉంటుంది. తాజాగా ఈరోజు హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.


ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా మాస్ దర్శకుడు హరీష్ శంకర్ హాజరయ్యారు. వెంకటాపురం బంగ్లా గురించి రితికా సింగ్ ఆరా తీయడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రంలో శ్రీరామ్, సుబ్బరాజు, ఉత్తేజ్, ప్రిన్సెస్ సహారా మరియు ఫర్ణిత రుద్రరాజు కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి కె సత్య సాయిబాబు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఉన్నారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM