యూట్యూబ్ ట్రేండింగ్ లో 'గామి' ట్రైలర్

by సూర్య | Fri, Mar 01, 2024, 03:09 PM

విద్యాధర్ కగిత దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'గామి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. విశ్వక్సేన్ ఈ సినిమాలో అఘోరాగా కనిపించనున్నాడు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు సమాచారం.

ఈ చిత్రం మహా శివరాత్రి శుభ సందర్భం సందర్భంగా మార్చి 8, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో విశ్వక్సేన్ సరసన చాందిని చౌదరి జోడిగా నటిస్తుంది. MG అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి మరియు హారిక పెడద ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM