'చందమామ కథలో చదివా' సాంగ్ లిరిక్స్

by సూర్య | Fri, Mar 01, 2024, 01:30 PM

చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో
బాలమిత్ర కథలో చదివా పగడపు దీవులు ఉంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో
నా కోసం రెక్కల గుర్రం ఎక్కివస్తావనీ
ఇక ఏనాటికి అక్కడే మనం ఉంటామనీ

నమ్మడానికి ఎంతో బాగుందో
నమ్మడానికి ఎంతో బాగుందో
నువ్వే నాకు ముద్దొస్తావనీ
నేనే నీకు ముద్దిస్తాననీ
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో

వరహాల బాటలోన రతనాల తోటలోన
వజ్రాల మేడలోన బంగరు గదిలోన
విరి తేనెల్లో పాలల్లో తానాలాడేసి
నెల వంకల్లో వెన్నెల్లో భోంచేసి
నలుదిక్కుల్లో చుక్కల్నే చిలకలు చుట్టేసి
చిలకే కొరికి దరికే జరిగి మురిపెం పెరిగి
మరి నువ్వే నాకు ముద్దిస్తావనీ
ముద్దల్లోన ముద్దవుతాననీ

నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో
చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో

ఎగిరేటి ఏనుగొచ్చి పలికేటి జింకలొచ్చి
నడిచేటి చేపలొచ్చి అడవికి రమ్మనగా
అహ కోనల్లో కొమ్మల్లో ఉయ్యాలూగేసి
ఆ కొమ్మల్లో పళ్ళన్నీ రుచి చూసి
అహ పళ్ళళ్ళో మైకంతో మోహం కమ్మేసి
చలిగా గిలిగా తొలిగా త్వరగా అటుగా ఇటుగా
మరి నువ్వే నాకు ముద్దిస్తావనీ
తడి వేదాలు ముద్రిస్తావనీ

నమ్మడానికి ఎంత బాగుందో
నీ కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తానని
పగడపు దీవికి నిన్నే నేనే తీసుకెళ్తాననీ
ఇక ఏనాటికి అక్కడే మనం ఉంటామని
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో

Latest News
 
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM
'సింగం ఎగైన్' లో బాలీవుడ్ సూపర్‌స్టార్ Thu, Sep 19, 2024, 07:19 PM