'రావణాసుర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్

by సూర్య | Thu, Feb 29, 2024, 09:10 PM

యువ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'రావణాసుర' 2023 ఏప్రిల్ 7న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌ అయ్యింది. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా తెలుగు వెర్షన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ మార్చి 3న జీ తెలుగు ఛానెల్‌లో ప్రదర్శించబడుతుందని సమాచారం.


అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్ అండ్ పూజిత పొన్నాడ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ సినిమాలో హీరో సుశాంత్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా, సత్య, జయ ప్రకాష్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు.


అభిషేక్ పిక్చర్స్ అండ్ ఆర్‌టి టీమ్‌ వర్క్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్ మరియు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

Latest News
 
ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న నిధి అగ ర్వాల్‌ Sun, Apr 21, 2024, 10:59 AM
రజినీ సినిమా నాగార్జున? Sun, Apr 21, 2024, 10:47 AM
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM
ఆదిత్య హాసన్ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్ Sat, Apr 20, 2024, 07:21 PM