రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'భూతద్దం భాస్కర్ నారాయణ'

by సూర్య | Thu, Feb 29, 2024, 09:02 PM

పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో శివ కందుకూరి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి భూతద్దం భాస్కర్ నారాయణ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో  శివకి జోడిగా రాశి సింగ్ నటిస్తుంది. ఈ చిత్రం మార్చి 1, 2024న విడుదల కానుంది.


ఈ చిత్రంలో చాయ్ బిస్కెట్ ఫేమ్ నటుడు అరుణ్ కుమార్‌తో పాటు దేవి ప్రసాద్, వర్షిణి సౌందర్‌రాజన్, శివ కుమార్, షఫీ, శివన్నారాయణ మరియు కల్పలత తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్నేహల్ జంగాలా, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై నిర్మించారు.


గౌతమ్ జార్జ్ సినిమాటోగ్రఫీ మరియు రోషన్ కుమార్ ప్రొడక్షన్ డిజైన్ అందించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల మరియు విజయ్ బుల్గానిన్ సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
ఈ నెల 31న విడుదల కానున్న భజే వాయు వేగం Tue, May 28, 2024, 08:25 PM
కళ్యాణ్ రామ్ నూతన చిత్రం గ్లింప్స్‌ విడుదల Tue, May 28, 2024, 08:24 PM
'ఓజీ' గురించి తాజా అప్‌డేట్‌ Tue, May 28, 2024, 08:23 PM
రూమర్స్‌ పై క్లారిటీ ఇచ్చిన నమిత Tue, May 28, 2024, 08:23 PM
భారీ బడ్జెట్ తో మహారాగ్ని Tue, May 28, 2024, 08:21 PM