'సరిపోదా శనివారం' గ్లింప్సె కి సాలిడ్ రెస్పాన్స్

by సూర్య | Mon, Feb 26, 2024, 07:49 PM

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ సరిపోదా శనివారం అనే టైటిల్ ని లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా గ్లింప్సె ని విడుదల చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ గ్లింప్సె యూట్యూబ్ లో 10 మిలియన్ డిజిటల్ వ్యూస్ ని సాధించినట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.


ఈ చిత్రం ఆగస్ట్ 15, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో నానికి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. ఈ చిత్రంలో SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. DVV ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన DVV దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చారు.

Latest News
 
మరోసారి చిక్కుల్లో పడ్డ నటుడు టామ్ చాకో Thu, Apr 17, 2025, 07:04 PM
రేపే 'థగ్ లైఫ్' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Apr 17, 2025, 06:54 PM
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ఈ తేదీన విడుదల కానుందా? Thu, Apr 17, 2025, 06:50 PM
'సారంగపాణి జాతకం' ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్ Thu, Apr 17, 2025, 06:42 PM
'ఎల్ 2: ఎంప్యూరాన్' డిజిటల్ ఎంట్రీకి తేదీ ఖరారు Thu, Apr 17, 2025, 06:38 PM