'ఓం భీమ్ బుష్‌' ట్రైలర్ లాంచ్ కి వెన్యూ లాక్

by సూర్య | Mon, Feb 26, 2024, 06:22 PM

హుషారు దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటితో శ్రీవిష్ణు ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'ఓం భీమ్ బుష్‌' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం 6 గంటలకి హైదరాబాద్ లోని RK సినీప్లెక్స్ లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.


ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ మరియు అయేషా ఖాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మార్చి 22, 2024న థియేట్రికల్ రిలీజ్ కి ఈ సినిమా సిద్ధంగా ఉంది. శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, మరియు రాచ రవి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సన్నీ MR సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ సమర్పణలో V సెల్యులాయిడ్ మరియు సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Latest News
 
SSMB29.. ఈనెల 11న ప్రియాంక చోప్రా లుక్ Sun, Nov 09, 2025, 03:12 PM
'శివ' సినిమా నా పై తీవ్ర ప్రభావం చూపింది - ప్రభాస్ Sun, Nov 09, 2025, 02:58 PM
షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా బడ్జెట్ రూ.350 కోట్లకు చేరిక Sun, Nov 09, 2025, 02:34 PM
మోహన్ లాల్ 'వృషభ' సినిమా మళ్ళీ వాయిదా Sun, Nov 09, 2025, 02:06 PM
మరో వారంలో రాజాసాబ్‌ మొదటి సింగిల్ Sun, Nov 09, 2025, 02:01 PM