'ఈగిల్' స్ట్రీమింగ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్ఫారం

by సూర్య | Mon, Feb 26, 2024, 03:20 PM

కార్తీక్ ఘట్టమ్నేని దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ఈగిల్' ఫిబ్రవరి 9, 2024న తెలుగు మరియు హిందీలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది.


లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఈటీవీ విన్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి అధికారకంగా ప్రకటించింది.


థ్రిల్లర్‌ ట్రాక్ లో వచ్చిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తుంది.

Latest News
 
బికినీలో దర్శనమిచ్చిన మృణాల్.. నిజమిదే.. Fri, Oct 18, 2024, 09:03 PM
టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌.. అనన్య నాగళ్ల ఏమన్నారంటే? Fri, Oct 18, 2024, 09:01 PM
'లక్కీ బాస్కర్' ట్రైలర్ లాంచ్ కి వెన్యూ ఖరారు Fri, Oct 18, 2024, 08:28 PM
'SDGM' ఫస్ట్ లుక్ విడుదలకి టైమ్ లాక్ Fri, Oct 18, 2024, 07:38 PM
'తలపతి69' లో విజయ్ పాత్రపై లేటెస్ట్ అప్డేట్ Fri, Oct 18, 2024, 07:32 PM