'రాయన్' నుండి ప్రకాష్ రాజ్ పోస్టర్ రిలీజ్

by సూర్య | Mon, Feb 26, 2024, 02:32 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన ల్యాండ్‌మార్క్ 50వ చిత్రానికి తానే స్వయంగా దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'రాయన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అభిమానులలో చాలా హైప్ మరియు అంచనాలు ఉన్నాయి. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రకాష్ రాజ్ పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ సినిమాలో విష్ణు విశాల్, దుషార విజయన్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, అపర్ణ బాలమురళి మరియు SJ సూర్య కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ధనుష్ పవర్ ఫుల్ క్యామియోలో కనిపించనున్నాడు. నార్త్ మద్రాస్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Latest News
 
మోడ్రన్ ఔట్ ఫిట్‌లో నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ అందాలు Sat, Oct 19, 2024, 09:03 PM
రాశి ఖన్నా గ్లామర్ ట్రీట్‌ Sat, Oct 19, 2024, 08:54 PM
ఈ హాట్ బ్యూటీని పెళ్లాడనున్న సుప్రీమ్ హీరో? Sat, Oct 19, 2024, 08:54 PM
చండీ హోమం చేసిన రేణూ దేశాయ్‌ Sat, Oct 19, 2024, 08:39 PM
'గేమ్ ఛేంజర్' స్పెషల్ సాంగ్ కోసం భారీ బడ్జెట్ Sat, Oct 19, 2024, 07:42 PM