ప్రతిష్టాత్మకంగా ‘కంగువ’.

by సూర్య | Fri, Feb 23, 2024, 06:37 PM

నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య  నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి శివ దర్శకుడు. దిశా పటానీ  హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో బాబీ డియోల్  కీ రోల్ ప్లే చేస్తున్నారు. తాజాగా ‘కంగువ’ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ అప్డేట్‌ను వదిలారు. ఈ సినిమాకు డబ్బింగ్ వర్క్స్ స్టార్ట్ అయినట్లుగా మేకర్స్ వెల్లడించారు. అంతేకాదు, సూర్య డబ్బింగ్ చెబుతున్నట్లుగా తెలుపుతూ ఒక ఫొటోని, అలాగే డబ్బింగ్ వర్క్స్ జరుగుతున్న అద్నాన్ ఆర్ట్స్ స్టూడియోస్‌లో హీరో సూర్యతో డైరెక్టర్ శివ, ఇతర టెక్నీషియన్స్ ఉన్న మరో ఫొటోని మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం సూర్య అభిమానులే కాకుండా.. ప్రేక్షకలోకం మొత్తం ఎంతగానో వేచి చూస్తోంది. ఈ సినిమా ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా మొత్తం పది భాషల్లో తెరకెక్కుతున్న ‘కంగువ’లో వరల్డ్ క్లాస్ మేకింగ్, సూర్య పర్‌ఫార్మెన్స్ హైలైట్ కానున్నాయని మేకర్స్ చెబుతున్నారు. హీరో సూర్య కెరీర్‌లో హై బడ్జెట్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఒక స్పెషల్ ఫిల్మ్ కాబోతోంది. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు. త్రీడీలోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు.


 

Latest News
 
బికినీలో దర్శనమిచ్చిన మృణాల్.. నిజమిదే.. Fri, Oct 18, 2024, 09:03 PM
టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌.. అనన్య నాగళ్ల ఏమన్నారంటే? Fri, Oct 18, 2024, 09:01 PM
'లక్కీ బాస్కర్' ట్రైలర్ లాంచ్ కి వెన్యూ ఖరారు Fri, Oct 18, 2024, 08:28 PM
'SDGM' ఫస్ట్ లుక్ విడుదలకి టైమ్ లాక్ Fri, Oct 18, 2024, 07:38 PM
'తలపతి69' లో విజయ్ పాత్రపై లేటెస్ట్ అప్డేట్ Fri, Oct 18, 2024, 07:32 PM