UK మరియు ఐర్లాండ్ లో 'బ్రహ్మయుగం' 5 రోజులలో ఎంత వసూళ్లు చేసినదంటే...!

by సూర్య | Wed, Feb 21, 2024, 06:26 PM

రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'బ్రహ్మయుగం' చిత్రం ఫిబ్రవరి 15, 2024న విడుదల అయ్యింది. హారర్-థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ఈ పాన్-ఇండియన్ చిత్రం ఎపిక్ ఫార్మాట్‌లో కూడా అందుబాటులో ఉంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా UK మరియు ఐర్లాండ్ లో విడుదలైన 5 రోజులలో £140,911 వసూళ్లు చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్ ఎల్ ఎల్ పి, వై నాట్ స్టూడియోస్ బ్యానర్లపై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ నిర్మిస్తున్నారు.

Latest News
 
బాలీవుడ్ లో విషాదం, నటి కామినీ కౌశల్ మృతి Fri, Nov 14, 2025, 04:25 PM
'దేవగుడి' మూవీ టీజర్ విడుదల Fri, Nov 14, 2025, 04:22 PM
‘కాంతార’ తరహాలో ‘కొరగజ్జ’ Fri, Nov 14, 2025, 04:21 PM
విజయ్‌ సేతుపతి సరసన నటించనున్న లిజోమోల్‌ జోస్‌ Fri, Nov 14, 2025, 04:19 PM
షారుక్‌ఖాన్‌ తో బుచ్చిబాబు సినిమా చేయనున్నాడా? Fri, Nov 14, 2025, 04:18 PM