![]() |
![]() |
by సూర్య | Wed, Feb 21, 2024, 03:52 PM
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మరియు సౌత్ స్టార్స్ జ్యోతిక మరియు మాధవన్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. హారర్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి 'షైతాన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని రేపు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం అజయ్ దేవగన్ మరియు మాధవన్ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు.
ఈ సినిమా మార్చి 8, 2024న విడుదల కానుంది. షైతాన్ సినిమా సూపర్ హిట్ గుజరాతీ హారర్ థ్రిల్లర్ వాష్ యొక్క అధికారిక రీమేక్. ఈ చిత్రానికి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవగన్ పైలట్‌గా నటించగా, అజయ్ భార్యగా జ్యోతిక కనిపించనుంది. జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్ మరియు పనోరమా స్టూడియోస్ బ్యానర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.
Latest News