'ఏమై పోయావే' సాంగ్ లిరిక్స్

by సూర్య | Wed, Feb 21, 2024, 12:35 PM

ఏమై పోయావే
నీ వెంటే నేనుంటే
ఏమై పోతానే
నువ్వంటూ లేకుంటే

నీతో ప్రతి పేజీ నింపేసానే
తెరవక ముందే పుస్తకమే విసిరేసావే
నాలో ప్రవహించే ఊపిరివే
ఆవిరి చేసి ఆయువునే తీసేసావే

నిను వీడి పోనంది
నా ప్రాణమే
నా ఊపిరినే నిలిపేది
నీ ధ్యానమే

సగమే నే మిగిలున్నా
శాసనమిది చెబుతున్నా
పోనే లేనే నిన్నొదిలే

ఏమై పోయావే
నీ వెంటే నేనుంటే
ఏమై పోతానే
నువ్వంటూ లేకుంటే

ఎటు చూడు నువ్వే
ఎటు వెళ్లనే
నే లేని చోటే
నీ హృదయమే

నువు లేని కల కూడా రానే రాదే
కల లాగ నువు మారకే
మరణాన్ని ఆపేటి వరమే నీవే
విరహాల విషమీయకే

ఏమై పోయావే
నీ వెంటే నేనుంటే
ఏమై పోతానే
నువ్వంటూ లేకుంటే

Latest News
 
రాంప్రసాద్ ప్రధాన పాత్రలో 'W/O అనిర్వేష్' Tue, Feb 18, 2025, 11:31 AM
ఈ నెల 26న విడుదల కానున్న 'మజాకా' Tue, Feb 18, 2025, 11:28 AM
వెంకీ అట్లూరి సినిమాలో భాగ్యశ్రీ బోర్సే Tue, Feb 18, 2025, 11:26 AM
ఈ నెల 21న విడుదల కానున్న ‘రామం రాఘవం’ Tue, Feb 18, 2025, 11:23 AM
థాయ్ లాండ్లో సందడిచేసిన శ్రీముఖి Tue, Feb 18, 2025, 11:17 AM