నేడే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి!

by సూర్య | Wed, Feb 21, 2024, 12:34 PM

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, నిర్మాత జాకీ భగ్నానీల పెళ్లికి ముహూర్తం దగ్గరపడింది. గత మూడేళ్లుగా లవ్‌లో ఉన్న ఈ ప్రేమజంట బుధవారం ఒక్కటికానున్నారు. గోవాలో బీచ్ ఒడ్డున ఉన్న ఐటీసీ గ్రాండ్ హోటల్ వీరి వివాహానికి వేదిక కానుంది. ఈ వివాహ వేడుకకు రకుల్ క్లోజ్ ఫ్రెండ్స్ ప్రజ్ఞా జైస్వాల్, లక్ష్మి మంచుతో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీస్ హాజరుకానున్నారు.
ఈ వివాహ మహోత్సవంలో బాలీవుడ్ మాజీ నటి శిల్పాషెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా ఒక పంజాబీ సాంగ్ కు నృత్యం చేయనున్నారు. వివాహమైన తర్వాత రకుల్, జాకీ భగ్నానీ జంట హనీమూన్ కు వెళ్లడం లేదని తెలుస్తోంది. ముందుగా ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తికాకపోవడమే దీనికి కారణం.

Latest News
 
దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు Sun, Jan 12, 2025, 09:13 PM
'మజాకా' ఆన్ బోర్డులో ప్రముఖ నటి Sun, Jan 12, 2025, 09:07 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'గరివిడి లక్ష్మి' ఫస్ట్ సింగల్ Sun, Jan 12, 2025, 09:03 PM
'నాగబంధం' నుండి రుద్రా లుక్ ని లాంచ్ చేయనున్న రానా Sun, Jan 12, 2025, 08:59 PM
23 ఏళ్ళ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న నాగ్ హీరోయిన్ Sun, Jan 12, 2025, 08:51 PM