1M+ వ్యూస్ ని సాధించిన 'గామి' క్యారెక్టర్ టీజర్

by సూర్య | Tue, Feb 20, 2024, 05:58 PM

విద్యాధర్ కగిత దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'గామి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. విశ్వక్సేన్ ఈ సినిమాలో అఘోరాగా కనిపించనున్నాడు.


ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమాలోని క్యారెక్టర్ టీజర్ ని విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ టీజర్ యూట్యూబ్ లో వన్ మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం ఆన్లైన్ లో సరికొత్త వీడియోని విడుదల చేసింది.


ఈ చిత్రం మహా శివరాత్రి శుభ సందర్భం సందర్భంగా మార్చి 8, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో విశ్వక్సేన్ సరసన చాందిని చౌదరి జోడిగా నటిస్తుంది. MG అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి మరియు హారిక పెడద ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
'వీరాంజనేయులు విహార యాత్ర' టీజర్ అవుట్ Fri, Jul 26, 2024, 08:34 PM
యువ దర్శకుడితో లారెన్స్ రాఘవేంద్ర స్ట్రెయిట్ తెలుగు సినిమా? Fri, Jul 26, 2024, 08:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'దసరా' Fri, Jul 26, 2024, 08:25 PM
తన పేరు మార్చుకున్న యంగ్ హీరో ఆకాష్ పూరి Fri, Jul 26, 2024, 08:20 PM
బిగ్ బాస్ 8 షోలో ప్రముఖ యాంకర్ Fri, Jul 26, 2024, 08:18 PM